Maharashtra: ఆ గ్రామంలో 18 ఏళ్లలోపు పిల్లలు మొబైల్స్ వాడడం నిషేధం
మానవజీవితంపై స్మార్ట్ ఫోన్లు ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పండుముసలి వరకు సెల్ ఫోన్లను విరివిగా వాడుతున్నారు. దీనితో భవిష్యత్ తరాల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారుతుందని భావిస్తూ కొన్ని గ్రామాల ప్రజలు దీని వినియోగంపై ఆంక్షలు పెట్టారు. కాగా మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలోని ఒక గ్రామం 18 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్లను ఉపయోగించడాన్ని నిషేధించింది.
Maharashtra: మానవజీవితంపై స్మార్ట్ ఫోన్లు ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పండుముసలి వరకు సెల్ ఫోన్లను విరివిగా వాడుతున్నారు. అరచేతిలో ప్రపంచం మొత్తాన్ని చుట్టిముట్టొచ్చేలా చేసే సాధనం కావడం వల్ల ఈ స్మార్ట్ యుగంలో దీని వాడకం నానాటికీ ఎక్కువవుతుంది. దీనితో రేడియేషన్ ఎక్కువయ్యి చిత్రవిచిత్ర వ్యాధులు వస్తోన్నాయని భావించిన పలువురు ఈ స్మార్ట్ ఫోన్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ తరాల మనుగడకు ఈ స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల ముప్పు పొంచి ఉందని భావిస్తూ కొన్ని గ్రామాల ప్రజలు ఇప్పటికే దీని వినియోగంపై కొన్ని షరతులు విధించాయి. కాగా ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలోని ఒక గ్రామం 18 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్లను ఉపయోగించడాన్ని నిషేధించింది.
పిల్లలు యుక్తవయస్కులు మొబైల్ ఫోన్లను అతిగా వాడుతూ ప్రపంచాన్ని మరిచి ప్రవర్తించడం. వారి కనీస నైపుణ్యాలను కూడా పొందలేకపోవడం, వంటి విపరీత ధోరణులకు పాల్పడడం గమనించిన పూసాద్ తహసీల్ పరిధిలోని బన్సి గ్రామ ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ గజానన్ టాలే ఆధ్వర్యంలో గ్రామస్థులంతా గ్రామసభ ఏర్పాటు చేసి 18ఏళ్లలోపు పిల్లలు మొబైల్స్ వాడకూడదంటూ తీర్మానం చేశారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలు ఈ నిషేధాన్ని ఖచ్చితంగా పాటించేలా చేయాలని సర్పంచ్ కోరారు.
తమ గ్రామంలోని పాఠశాల విద్యార్థులంతా మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారనే విషయం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ తెలిపారు. ఈ తీర్మానం అమలు చేయడంలో ఇబ్బందులు ఉంటాయని మాకు తెలుసు అయితే కౌన్సెలింగ్ ద్వారా ఈ సమస్యలను అధిగమిస్తాం. కానీ గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించటం చాలా సంతోషంగా అనిపించింది. నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తామని సర్పంచ్ గజానన్ టాలే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వివాదాస్పదంగా కాంగ్రెస్ నేత కమల్నాథ్ బర్త్ డే.. హనుమంతుని ఫోటోతో ఆలయ ఆకారంలో కేక్