Health Director G Srinivasa Rao: ఆర్ఎంపీలు నడిపే ఆస్పత్రులు, క్లినిక్‌లు మూసివేత.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
తెలంగాణ రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్ లు, ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నామన్నారు.
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్ లు, ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నామన్నారు. నాలుగు రోజులుగా 1569 ఆస్పత్రులు తనిఖీ చేశామన్నారు. లైసెన్స్ లు లేని 81 ఆస్పత్రులు సీజ్ చేశామన్నారు. 64 ఆస్పత్రులకు ఫైన్లు వేశామన్నారు. రెండు వారాల్లో స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఎంపీలు నడిపే ఆస్పత్రులు, క్లినిక్‌లు మూసివేతకు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ వో లను ఆదేశించినట్లు తెలిపారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటళ్ల పై హెల్త్ ఆఫీసర్లు దాడులు చేస్తున్నారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ రిజిస్ట్రేషన్, డాక్టర్ల రిజిస్ట్రేషన్, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం దవాఖానలో ఉన్న సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా, నకిలీ డాక్టర్లతో, రూల్స్‌కు విరుద్ధంగా నడుపుతున్న దవాఖాన్లను సీజ్ చేస్తున్నారు.
అధికారుల పరిశీలనలో యాదాద్రి జిల్లా భువనగిరి, నాగర్‌కర్నూలు టౌన్, సూర్యాపేట, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ తదితర ప్రాంతాల్లోని పలు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నట్లు గుర్తించారు. వీటిలో కొన్నింటిని సీజ్ చేయగా మరికొన్నింటకి నోటీసులు ఇచ్చారు.