Last Updated:

Road Accident: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. అడిషనల్ డీసీపీ దుర్మరణం

Road Accident: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. అడిషనల్ డీసీపీ దుర్మరణం

Road Accident in Hyderabad: హైదరాాబాద్‌లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

 

లక్ష్మారెడ్డి పాలెం మైత్రి కుటీర్‌లో నివాసం ఉంటున్న అడిషనల్ డీసీపీ బాబ్జి తెల్లవారుజామున వాకింగ్ వెళ్లారు. ఈ సమయంలో ఆయన రోడ్డు దాటుతుండగా.. విజయవాడ జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అనంతరం దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి: