LB Nagar MLA : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

LB Nagar MLA : బీఆర్ఎస్ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై సుధీర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఎల్బీనగర్ పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎల్బీనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రొటోకాల్ గొడవ జరిగింది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్లో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాజాగా మరోసారి సోమవారం అవే పనులకు మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి శంకుస్థాపన చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన తర్వాత కార్పొరేటర్ ఎలా చేస్తారని బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని పీస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్పొరేటర్ నర్సింహారెడ్డి, హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్ సుజాత ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.