Home / ట్రెండింగ్ న్యూస్
బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి మరియు కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ సోమవారం ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ పై 81,326 ఓట్లతో విజయం సాధించారు.
గత కొన్నేళ్లుగా ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించిన హీరో అల్లరి నరేష్. ఇపుడు కొత్త జోనర్ లో వెడుతున్నాడు. నరేష్ ఇప్పుడు విభిన్నమైన సబ్జెక్ట్‌లను వెతుకుతున్నాడు. ఇందులో భాగమే విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందిన చిత్రం నాంది.
నటి తమన్నా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌తో బబ్లీ బౌన్సర్ సినిమా కోసం జతకట్టింది. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. తమన్నా బౌన్సర్లను ఉత్పత్తి చేసే ఫతేపూర్‌కు చెందిన బబ్లీ అనే యువతి పాత్రను పోషిస్తుంది.
జార్ఖండ్ అంసెబ్లీలో సిఎం హేమంత్ సోరెన్ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో ఆయన తన మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటు వేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బిజెపి సభ నుంచి వాకౌట్ చేసింది.
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఈ సీజన్ కూడా ఐదోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఈ రియాలిటీ షో చూసే అభిమానులు కొన్ని లక్షల్లో ఉన్నారు మరి వాళ్ళని అలరించడానికి సరి కొత్తగా ముస్తాబైనది.
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పై పాకిస్థాన్ గెలిచింది. దీనితో టీమిండియా క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. మొదట ఆడిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. రెండో మ్యాచ్‌లో టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబాయి కారు ప్రయాణం చేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆయన వెళ్తున్న కారు పాల్ఘడ్ జిల్లాలో సూర్యనదిపై ఉన్న డివైడర్ ఢీకొని సైరస్ మిస్త్రీ గారు అక్కడే మృతి చెందారు.
సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 16న భారతదేశంలో జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినీ ప్రియులందరికీ భారతదేశం అంతటా అన్ని సినిమాలకు భారీ ధర తగ్గింపు లభించనుంది.
లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం జనగణమన పై దాని ప్రభావం పడింది. ఈ సినిమా నిర్మించే మై హోమ్ గ్రూప్ ప్రాజెక్టును వదిలేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.