Last Updated:

Babli Bouncer Trailer: బబ్లీ బౌన్సర్ ట్రైలర్ రిలీజ్

నటి తమన్నా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌తో బబ్లీ బౌన్సర్ సినిమా కోసం జతకట్టింది. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. తమన్నా బౌన్సర్‌లను ఉత్పత్తి చేసే ఫతేపూర్‌కు చెందిన బబ్లీ అనే యువతి పాత్రను పోషిస్తుంది.

Babli Bouncer Trailer: బబ్లీ బౌన్సర్ ట్రైలర్ రిలీజ్

Tollywood: నటి తమన్నా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌తో బబ్లీ బౌన్సర్ సినిమా కోసం జతకట్టింది. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. తమన్నా బౌన్సర్‌లను ఉత్పత్తి చేసే ఫతేపూర్‌కు చెందిన బబ్లీ అనే యువతి పాత్రను పోషిస్తుంది. బాల్యం నుండే, బబ్లీ తండ్రి ఆమెకు కుస్తీలో శిక్షణ ఇచ్చి పురుషులతో సమానంగా మల్లయోధులను చేసేలా చేశాడు. చివరికి, బబ్లీకి ఢిల్లీలో లేడీ బౌన్సర్ ఉద్యోగం వస్తుంది. బబ్లీ దైర్యవంతురాలైన యువతి. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి అనేది సినిమా ప్రధానాంశం.

ట్రైలర్ ఉల్లాసంగా ఉంది. తమన్నా చాలా ఈజ్ గా నటించింది. ఇటీవల చిత్రాలతో పోల్చితే ఇందులో ఆమె నటన పూర్తగా భిన్నంగా ఉంది. తమన్నా తండ్రిగా సౌరభ్ శుక్లా నటించాడు. బబ్లీ బౌన్సర్ చిత్రం హిందీ, తమిళం మరియు తెలుగులో సెప్టెంబర్ 23న నేరుగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలవుతోంది.

ఇవి కూడా చదవండి: