Home / ట్రెండింగ్ న్యూస్
ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదనుకోండి. దానిని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు నాణ్యతప్రమాణాలు లేకుండా అడ్డగోలుగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనిపై ఆహార పరిరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్. అయితే ఇప్పటికే ఈయన తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు మస్క్. ఈ తరుణంలోనే ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించాడు. మరి ఆ పాలసీ వివరాలేంటో చూసేయ్యండి.
తన ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కు అతనితో నిశ్చితార్థం జరిగింది.
అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ జైలు పాలయిన విషయం విధితమే. కాగా తాజాగా ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటూ సర్వ సుఖాలు అనుభవిస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.
ప్రెగ్నెంట్ అంటూ తనపై వస్తోన్న వార్తలపై కోలీవుడ్ ప్రముఖ నటి నిక్కీ గల్రానీ స్పందించారు. ఆమె గర్భం దాల్చిందని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ తరుణంలో వాటిపై నిక్కీ స్పందించారు. అవి రూమర్లంటూ కొట్టిపడేశారు. 'డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి' అంటూ కౌంటర్ వేశారు.
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నడిరోడ్డుపైనే జుట్టుజుట్టు పట్టుకుని పొట్టుపొట్టున కొట్టుకున్నారు. వారి స్నేహితులు ఇద్దరిని విడదీసేందుకు ప్రయత్నించినా వారు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్‌లోని గంగాపూర్ రోడ్డులోని ఓ కళాశాలలో చోటుచేసుకుంది.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా 'ఇదేం కర్మ' అనే కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టబోతోంది.
బిగ్ బాస్ ఎపిసోడ్ హైలెట్స్ చూద్దాం. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య గట్టి ఫైట్ నడిచింది.ఈ టాస్క్ లో చివరగా ఫైమా, రేవంత్, శ్రీహాన్‌లు మిగిలారు.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు క్రికెట్ లవర్స్ తో పాటు దేశప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది.