Home / ట్రెండింగ్ న్యూస్
ఇండోనేషియాను వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న సంభవించిన భూ ప్రకంపనల ధాటికి 162 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
90వ దశకంలో వచ్చిన ప్రేమదేశం సినిమా గురించి తెలియని వారుండరు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన అబ్బాస్ ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్నాడు. కాగా తాజాగా ఆయన సంబంధించిన హాస్పిటల్ బెడ్ పై ఒక ఫొటో, వాకింగ్ స్టిక్ నడుస్తూ మరో ఫొటో కనిపిస్తున్నాయి. వీటిని చూసిన అభిమానులు అబ్బాస్ కు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలనాటి క్లాసిక్ చిత్రాలకు ఇప్పుడు అరుదైన గౌరవం లభిస్తోంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆల్టైమ్ క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’. ఈ మూవీకి గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవం దక్కింది.
మన వాట్సాప్ ను మరొకరు చూస్తే మన గోప్యతకు భంగం కలుగుతుంది కదా డెస్క్ టాప్ లలో వాట్సాప్ లాగిన్ చేసి లాగ్ అవుట్ చెయ్యడం మర్చిపోతే దానిని ఎవరు ఓపెన్ చేసినా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. కాగా ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. డెస్క్ టాప్ (కంప్యూటర్లు)పై వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వాలంటే పాస్ వర్డ్ ఇవ్వడం తప్పనిసరి.
ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధవాకర్ హత్యకేసును సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును మూవీగా రూపొందించేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట.
ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన అక్కడి ప్రజలు పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను చితకబాదారు. ప్రజల బారి నుంచి అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి తిరిగి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులో చోటుచేసుకుంది. అసలు ఎందుకు ఎమ్మెల్యేను ప్రజలు కొట్టాల్సి వచ్చిందో ఈ కథనం ద్వారా చూసేద్దాం.
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మస్క్ ట్విట్టర్ కు బాస్ అయిన వెంటనే సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే. కాగా మస్క్ చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా 1,200 మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు.
మెగాస్టార్ చిరంజీవిని మరో అరుదైన అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని చిరు కౌవసం చేసుకున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. నేడు తను ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఈ ఇద్దరి పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది.
సమీప బంధువులు లేదా తెలిసినవాళ్లకు పెండ్లికి పిలవడం చూస్తుంటాం. కానీ ఆ యువ జంట మాత్రం తమ దేశాన్ని తమను ఎంతో సుఖసంతోషాలతో ఉండేలా చూస్తూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు పెండ్లి పత్రిక పంపి వివాహానికి ఆహ్వానించారు.