Home / Telangana Assembly Elections 2023
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. ఈ క్రమం లోనే అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఈరోజు నుంచి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు నుంచి నవంబర్ 9 వ
తెలంగాణ బీజేపీ నేతలు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాదాపు 52 మందితో తొలి జాబితాను అధిష్టానం విడుదల చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి నిలబెట్టింది. ఇక అంతా ఊహించినట్టే.. ఈటల రాజేంద్ర.. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులంతా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం రెగ్యులర్ గా జరిగే పని అయినప్పటకి పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఓ అంశం పట్ల బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్దం జరుగుతుంది. తెలంగాణలో రైతు కుటుంబాలకు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం కాంగ్రెస్ బస్సు యాత్ర రేపటినుంచి ప్రారంభం కానుంది. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రని లాంఛనంగా ప్రారంభిస్తారు.రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని రాహుల్, ప్రియాంక దర్శించుకుంటారు. ఆరు గ్యారంటీలను శివుడి ముందు పెట్టి పూజలు చేస్తారు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఈరోజు మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం జనగామలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రజలపై ఎన్నికల వరాలు కురిపించారు. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పేరుతో కొత్త పథకం ప్రవేశపెడతామన్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తామన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్‌లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కాగా నిన్ననే తెలంగాణలో ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో తెలంగాణలో చేపట్టాలని సన్నాహాలు చేస్తున్న బీజేపీ.. ఆ దిశగా తెలంగాణలో ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు వరుస పర్యటనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.