Last Updated:

Whatsapp desktop: మరింత అట్రాక్టివ్ గా వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను మొబైల్‌లో వాడే వారి సంఖ్య అధికం. అయితే, పనివేళల్లో వాట్సాప్ ను వాడటం కూడా అనివార్యమైంది.

Whatsapp desktop: మరింత అట్రాక్టివ్ గా వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌

Whatsapp desktop: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను మొబైల్‌లో వాడే వారి సంఖ్య అధికం. అయితే, పనివేళల్లో వాట్సాప్ ను వాడటం కూడా అనివార్యమైంది. దీంతో డెస్క్‌టాప్‌ యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్‌ తన డెస్క్‌టాప్‌ యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా కొత్త విండోస్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ను వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చింది.

 

వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త యాప్‌ను మైక్రోసాఫ్ట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొత్త డెస్క్‌టాప్‌ యాప్‌ వేగంగా లోడ్‌ అవ్వడమే కాకుండా ఇంటర్‌ఫేస్‌లో కూడా మార్పులు చేసింది. ఇకపై వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ ద్వారా ఒకేసారి 8 మందితో వీడియో కాల్‌లో మాట్లాడే వీలు ఉంది. 32 మందితో గ్రూప్‌ ఆడియో కాల్స్‌ కూడా మాట్లాడొచ్చు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను మరింత పెంచుతామని వాట్సాప్‌ చెబుతోంది.

లింక్ డివైజ్ లో కూడా మార్పులు(Whatsapp desktop)

మరోవైపు వాట్సాప్‌లో లింక్‌ డివైజ్ ఫీచర్‌ను సైతం మెటా మరింతగా మెరుగుపరిచింది. ఒకప్పుడు వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌లో వాడాలంటే మొబైల్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాల్సి వచ్చేది. ఇంటర్నెట్‌ తప్పనిసరిగా ఆన్‌లో ఉంచాల్సి ఉండేది. లింక్‌ డివైజ్‌ ఫీచర్‌ తీసుకొచ్చాక మొబైల్‌ డేటా ఆఫ్‌లో ఉన్నా.. వాట్సాప్‌ను వినియోగించుకునే సదుపాయాన్ని వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇలా నాలుగు డివైజ్‌లకు కనెక్ట్‌ కావొచ్చు. డివైజ్‌ను వేగంగా లింక్‌ చేసుకోవడంతో పాటు వేగంగా సింక్‌ చేసుకోవచ్చని మెటా పేర్కొంది. కొత్తగా లింక్‌ ప్రివ్యూ, స్టిక్కర్లను సైతం తీసుకొచ్చినట్లు వాట్సాప్ వెల్లడించింది.