Published On:

Smartphones Under Rs 15,000: మీ బడ్జెట్ రూ.15 వేలా..? ఈ ఫోన్లు చీప్ అండ్ బెస్ట్..!

Smartphones Under Rs 15,000: మీ బడ్జెట్ రూ.15 వేలా..? ఈ ఫోన్లు చీప్ అండ్ బెస్ట్..!

Budget Friendly Smartphones Under Rs 15,000 Only: భారతీయ మార్కెట్‌లోని ప్రతి విభాగంలోనూ విభిన్న ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. 10,000 రూపాయల నుండి లక్షల రూపాయల వరకు ఉన్న ఫోన్లు మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. మీరు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 15 రూపాయల లోపు ధరకు అనేక గొప్ప ఫీచర్లతో కూడిన ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు, అదే జాబితాలో రూ. 13 వేల కంటే తక్కువ ధర ఉన్న 3 5G అద్భుతమైన ఫోన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

OPPO K12x 5G

Oppo K12X 5G ఫోన్ 6.67-అంగుళాల HD డిస్‌ప్లేతో విడుదలైంది. ఈ ఫోన్‌లో 32MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 5100 mAh బ్యాటరీతో వచ్చింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కు బదులుగా రూ.12,999గా ఉంది. దీని ధరపై 23 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఫోన్ ధరను మరింద తగ్గించవచ్చు.

 

Redmi 13 5G

బడ్జెట్ 15 వేల కన్నా తక్కువ ఉంటే మీరు Redmi 13 5G ఫోన్ ఆర్డర్ చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.17,999కి బదులుగా రూ.12,499. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల తర్వాత చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.79 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 5030 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ,108MP + 2MP డ్యూయల్ కెమెరా ఉంది. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది.

 

Realme P3x 5G

రియల్‌మీ పి3ఎక్స్ 5జీ ఫోన్‌లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే ఉంది. దీనిలో 6000 mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ ఉంది. దీనికి 50MP వెనుక కెమెరా, 8MP ముందు కెమెరా ఉన్నాయి. దీని 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.16,999 కు బదులుగా రూ.12,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్, డిస్కౌంట్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో జాబితా చేశారు. దీని ద్వారా మరింత తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.