Realme Narzo 80 Pro And 80X: రియల్‌మి నుంచి ఏప్రిల్ 15న కొత్త ఫోన్లు.. ఇవిగో బెస్ట్ ఆఫర్లు.. ఫీచర్‌లు, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!

Realme Narzo 80 Pro And 80X: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 20,000 కంటే తక్కువ ఉంటే, మీరు మీ విస్‌లిస్ట్‌లో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ను చేర్చచ్చు. ప్రముఖ ఫోన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి అద్భుతమైన పనితీరుతో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. రియల్‌మి నార్జో 80 ప్రో, రియల్‌మి నార్జో 80ఎక్స్ అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. ఈ ఫోన్ మొదటి సేల్ త్వరలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వస్తుంది.
Realme Narzo 80 Pro and 80X First Sale
రియల్‌మి నార్జో 80 ప్రో, రియల్‌మి నార్జో 80ఎక్స్ మొదటి సేల్ మంగళవారం, ఏప్రిల్ 15న ప్రారంభమవుతుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు బ్యాంక్ ఆఫర్‌ల కింద డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 2000 వరకు తగ్గింపు పొందచ్చు. మీరు రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ నుంచి రియల్‌మి నార్జో 80 ప్రో, రియల్‌మి నార్జో 80ఎక్స్‌ని కొనుగోలు చేయచ్చు.
Realme Narzo 80 Pro, 80X Price
రియల్‌మి నార్జో 80 ప్రో 5G ప్రారంభ ధర రూ.17,999. ఇది రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది – స్పీడ్ సిల్వర్, రేసింగ్ గ్రీన్. కాగా, రియల్‌మి నార్జో 80X ప్రారంభ ధర రూ.11,999. ఈ ఫోన్‌లో రెండు కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నార్జో 80X, రియల్‌మి నార్జో 80 ప్రో కంటే భిన్నమైన రంగులలో లభిస్తుంది. నార్జో 80X కోసం డీప్ ఓషన్, సన్‌లిట్ గోల్డ్ వంటి రంగు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
Realme Narzo 80 Pro 5G Camera, Battery
ముందుగా, రియల్‌మి నార్జో 80 ప్రో 5G కెమెరా, బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5G చిప్‌సెట్‌తో వస్తుంది. సోనీ IMX882 OIS 50MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh టైటాన్ బ్యాటరీతో 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కాబట్టి కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటలకు పైగా గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు.
Realme Narzo 80 Pro Specifications
రియల్‌మి నార్జో 80 ప్రో 5జీ గొప్ప గేమింగ్ పనితీరును అందిస్తుందని హామీ ఇచ్చింది కంపెనీ. గేమర్స్ కి గేమింగ్ అనుభవం అద్భుతంగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5G చిప్‌సెట్ పనితీరు మెరుగ్గా ఉండచ్చు. 780k కంటే ఎక్కువ AnTuTu స్కోరు చేసింది. వినియోగదారులు BGMIలో మృదువైన 90FPS గేమ్‌ప్లేను అనుభవించవచ్చు. ఈ ఫోన్ 4500నిట్స్ హైపర్‌గ్లోతో 6.7-అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2500Hz టచ్ శాంప్లింగ్ స్క్రీన్‌కు సపోర్ట్ చేస్తుంది.
Realme Narzo 80X Specifications
రియల్‌మి నార్జో 80ఎక్స్ 5జీ 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయితే చాలా కాలం పాటు ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెకక్ డైమెన్సిటీ 6400 5G చిప్‌సెట్ ఉంది. అలానే 6.72-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz స్క్రీన్, 950నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లోని మెయిన్ కెమెరా 50MP ఓమ్నివిజన్ OV50D. ఈ సరసమైన ప్రీమియం డిజైన్ స్మార్ట్‌ఫోన్ గొప్ప పనితీరును అందిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Flipkart 43 Inches Smart TV Offers: 61శాతం ఆఫ్.. 43 ఇంచెస్ స్మార్ట్‌టీవీలపై ఆఫర్ల రచ్చ.. డిస్‌ప్లే క్వాలిటీ అదిరింది..!