Oppo F29 Pro 5G: ఫీచర్స్ తెలిస్తే గంతేస్తారు.. ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?

Oppo F29 Pro 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘Oppo F29 Pro 5G’ని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కనిపించింది. కంపెనీ త్వరలో ఈ మొబైల్‌ని ప్రారంభించే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. కాబట్టి, ఈ ఫోన్‌లో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి? ధర ఎంత? తదితర వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Oppo F29 Pro 5G Features
లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ అందించవచ్చని భావిస్తున్నారు. ఇందులో LPDDR4X RAM, UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఆండ్రాయిడ్ 15-ఆధారంగా ColorOS 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుందని చెబుతున్నారు.
కెమెరా విభాగంలో కొత్త ఒప్పో ఎఫ్ 29 ప్రో 5 జి స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, వెనుకవైపు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. అలాగే, స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది, ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. దీని మోడల్ నంబర్ CPH2705.
Oppo F29 Pro 5G Price
ఒప్పో ఎఫ్ 29 ప్రో 5 జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ఒప్పో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, దీని ఫీచర్లు గత డిసెంబర్ 2024లో చైనాలో లాంచ్ అయిన Oppo A5 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను పోలి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ చైనాలో CNY 1,999 ప్రారంభ ధరతో ప్రారంభించారు, ఇది భారతదేశంలో దాదాపు రూ. 23,300 ధరతో విడుదల కావచ్చు.
ఓవరాల్‌గా ఒప్పో ఎఫ్ 29 ప్రో 5 జి స్మార్ట్‌ఫోన్, శక్తివంతమైన చిప్‌సెట్, అద్భుతమైన డిస్‌ప్లే, మంచి కెమెరా, దీర్ఘకాలిక బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తోంది. ఈ ఫోన్ లాంచ్‌తో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విపరీతమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నారు. కాబట్టి రాబోయే ఒప్పో ఎఫ్ 29 ప్రో 5 జి స్మార్ట్‌ఫోన్ గురించి మరింత సమాచారం లాంచ్ సమయంలో అందుబాటులోకి వస్తుంది.