Published On:

Motorola Edge 60 Fusion Offers: కొత్త మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్.. ఆఫర్లు మాత్రం కిర్రాక్.. ఈ నెల 9న సేల్.. ధర ఎంత ఉండొచ్చంటే..!

Motorola Edge 60 Fusion Offers: కొత్త మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్.. ఆఫర్లు మాత్రం కిర్రాక్.. ఈ నెల 9న సేల్.. ధర ఎంత ఉండొచ్చంటే..!

Motorola Edge 60 Fusion Offers: మోటరోలా కంపెనీ గత వారం కొత్త 5G మొబైల్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కంపెనీ తన ఎడ్జ్ సిరీస్‌ను విస్తరించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Motorola Edge 60 Fusion 5G అధికారికంగా భారతదేశంలోకి వచ్చింది. ఈ ఫోన్ మొదటి సేల్ ఏప్రిల్ 9న ఫ్లిప్‌కార్ట్‌‌ ద్వారా ప్రారంభం కానుంది. అయితే ఫస్ట్ సేల్‌కి ముందు కంపెనీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ధర, ఆఫర్, స్పెసిఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Motorola Edge 60 Fusion Price And Offers
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ 8GB RAM + 256GB స్టోరేజ్,12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. వీటి ధర వరుసగా రూ.22,999. రూ. 24,999 కంపెనీ మొదటి సేల్ కోసం ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 2,000 రాయితీ ఇస్తుంది. రూ. 20,999 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది పాంటోన్ అమెజోనైట్, పాంటోన్ స్లిప్‌స్ట్రీమ్ పాంటోన్ జెఫిర్ రంగులలో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్, రిలయన్స్ డిజిటల్‌తో సహా ప్రధాన రిటైలర్‌ల ద్వారా ఏప్రిల్ 9 మధ్యాహ్నం 12 గంటలకు తన మొదటి విక్రయాన్ని ప్రారంభించనుంది.

Motorola Edge 60 Fusion Features And Specifications
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 2712 x 1220 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ మోటరోలా ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. భారతదేశంలో ఈ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న మొదటి మొబైల్ ఇదే. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం Mali G615 MC2 GPUని కూడా ఉంది.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ మొబైల్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో LED ఫ్లాష్ లైట్ ఉంది. దీనితో పాటు, 13-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్,12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ 5,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 68W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారుర.వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP69 రేటింగ్ బిల్డ్ అందించారు. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది వాటర్ టచ్ 3.0, మోటో గెస్చర్స్, AI ఫీచర్లతో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.4, వైఫై 6, ఎన్ఎఫ్‌సి , యూఎస్‌బి టైప్-C ఉన్నాయి.