Published On:

iQOO Neo 10R: బడ్జెట్‌లో దుమ్ములేపుడే.. ఐక్యూ నియో 10ఆర్ వచ్చేస్తోంది.. రేపే లాంచ్..!

iQOO Neo 10R: బడ్జెట్‌లో దుమ్ములేపుడే.. ఐక్యూ నియో 10ఆర్ వచ్చేస్తోంది.. రేపే లాంచ్..!

iQOO Neo 10R: గేమింగ్ ప్రియులకు శుభవార్త. రేపు దేశంలో కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ‘iQOO Neo 10R’ ఫోన్ దేశీయ మార్కెట్లోకి రేపు అంటే మార్చి 11 గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. రూ.30,000 లోపు ధరతో ఈ మొబైల్ లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌, 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 1.5K ఐ కేర్ AMOLED డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఇందులో 6,400mAh కెపాసిటీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

iQOO Neo 10R Launch Details
ఐక్యూ నియో 10ఆర్ 5జీ ఫోన్ రేపు మార్చి 11 భారతదేశంలో అధికారికంగా విడుదల కానుందిత. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లను కంపెనీ వెల్లడించనుంది. దీనితో పాటు లాంచ్ ఈవెంట్ ద్వారా సేల్ తేదీ, ఆఫర్ గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. లాంచ్ ఈవెంట్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో, అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ అవుతుంది. ఈ ఫోన్ మైక్రో సైట్ ఇప్పటికే షాపింగ్ సైట్ అమెజాన్‌లో లైవ్‌ అవుతుంది.

iQOO Neo 10R Price
ఐక్యూ నియో 10ఆర్ ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్‌లో విడుదల కానుంది. నివేదిక ప్రకారం, ఈ మొబైల్‌లో 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌ను రూ.30 వేల రేంజ్‌లో విక్రయించనున్నారు. బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో మీరు దీన్ని రూ. 30,000 లోపు కొనుగోలు చేయచ్చు.

iQOO Neo 10R Features And Specifications
ఈ 5జీ స్మార్ట్‌పోన్‌లో 6.78-అంగుళాల 1.5K ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది పంచ్ హోల్ స్టైల్ డిస్‌ప్లే. కంపెనీ ఈ స్క్రీన్‌ని ‘ఐ కేర్ డిస్‌ప్లే’ అని పిలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3840Hz PWM డిమ్మింగ్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 12GB RAM తో వస్తుంది. గేమింగ్ కోసం ఈ ఐక్యూ ఫోన్‌లో 2000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో బిల్ట్ ఇన్ FPS మీటర్‌ ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 6000mm2 ఆవిరి కూలింగ్ ఛాంబర్ కూడా ఉంది. భారీ గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఇది నిరోధిస్తుంది.

మొబైల్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందించారు. ఫోన్‌లో 6400mAh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ఉంటుంది. కంపెనీ దీనిని భారతదేశపు సన్నని మొబైల్ అని పిలుస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు.