Last Updated:

Holi Smartphone Deals 2025: హోలీ వేళ.. డిస్కౌంట్ మేళా.. ఈ ఫోన్లపై భారీగా ఆఫర్లు..!

Holi Smartphone Deals 2025: హోలీ వేళ.. డిస్కౌంట్ మేళా.. ఈ ఫోన్లపై భారీగా ఆఫర్లు..!

Holi Smartphone Deals 2025: హోలీ పండుగ దగ్గరలోనే ఉంది. ఈ సందర్భంగా మార్కెట్లో విపరీతమైన ఆఫర్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రత్యేక సేల్‌ను తీసుకువచ్చింది. ఇక్కడ అనేక స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ అవకాశం మీకు ప్రత్యేకంగా ఉంటుంది. హోలీకి ముందు ధరలు భారీగా తగ్గుతున్న 5 గొప్ప స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G
జాబితాలో మొదటి ఫోన్ విషయానికి వస్తే హోలీకి ముందు చాలా తక్కువ ధరలో Vivo T3 Pro 5G అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 29,999కి పరిచయం చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 22,999కే మీ సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో, కంపెనీ రూ. 2500 వరకు అదనపు తగ్గింపును ఇస్తోంది, ఇది ధరను మరింత తగ్గిస్తుంది.

REDMI Note 14 Pro 5G
రెండవ ఫోన్ Redmi నుండి వచ్చింది, దీని ధర కూడా తగ్గింది. కంపెనీ ఈ ఫోన్‌ని రూ. 28,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 24,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, అన్ని బ్యాంకు క్రెడిట్ కార్డ్‌లపై రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలానే ఫోన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Motorola Edge 50 Fusion
హోలీకి ముందు, ఈ మోటరోలా ఫోన్ కూడా చాలా చౌక ధరలో లభిస్తుంది. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.5 వేల తగ్గింపును ఇస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ని రూ. 27,999కి పరిచయం చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 22,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఆల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో రూ. 1500 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.

POCO F6 5G
పోకో ఈ ఫోన్ కూడా హోలీకి ముందు చౌకగా లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ని రూ. 33,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 22,999కే మీ సొంతం చేసుకోవచ్చు. అంటే ఫోన్ పై రూ.11 వేలు తగ్గింపు ఇస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్‌లో 5శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

Realme P3 Pro 5G
రియల్‌మీ కూడా ఈ సేల్‌లో చాలా చౌక ధరలో లభిస్తుంది. కంపెనీ ఇటీవలే ఈ ఫోన్‌ను రూ. 28,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు హోలీకి ముందు, ఈ డివైజ్ రూ. 23,999కి మాత్రమే అందుబాటులో ఉంది, ఇది చాలా మంచి డీల్. అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో అదనంగా రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది.