Vivo T3x 5G: ఆఫర్ దద్దరిల్లింది.. వివో T3x 5Gపై భారీ డిస్కౌంట్..!
Vivo T3x 5G: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో గతేడాది ఏప్రిలో టీ సిరీస్‌లో Vivo T3x 5Gని విడుదల చేసింది. ఇప్పుడు ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ దీని ధర రూ.1000 తగ్గింది. ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో ప్రారంభించారు. ఇది పెద్ద FHD డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు కస్టమర్లు భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేయచ్చు. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vivo T3x 5G Offer
Vivo దాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా Vivo T3x ఇప్పుడు 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499కి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. 6GB + 128GB, 8GB + 128GB మోడల్స్ ధరలు వరుసగా రూ.13,999, రూ.15,499కి తగ్గాయి. 4GB, 6GB +8GB RAM వేరియంట్‌ల ధరలు గతంలో వరుసగా రూ.13,499, రూ.14,999, రూ.16,499గా ఉన్నాయి. ఇది క్రిమ్సన్ బ్లిస్, సెలెస్టియల్ గ్రీన్, సఫైర్ బ్లూ షేడ్స్‌లో అందించారు.
Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ Vivo ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుండి ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు అన్ని క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 1500 తగ్గింపును పొందచ్చు. ఇందులో నో-కాస్ట్ EMI ఎంపికలు రూ. 4167 నుండి ప్రారంభమవుతాయి.
Vivo T3x 5G Specifications
Vivo T3x 5G ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14 పై రన్ అవుతుంది. ఇది 67.2-అంగుళాల ఫుల్-HD (1,080×2,408 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది 8GB వరకు LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో అటాచ్ చేసి 4nm ప్రాసెస్‌పై నిర్మించిన స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో ర్యామ్‌ని వర్చువల్‌గా 8GB వరకు పెంచుకోవచ్చు. ఇది కాకుండా ఆన్‌బోర్డ్ స్టోరేజ్ మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.
ఆప్టిక్స్ కోసం ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, రెండవ 2MP సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ఇది 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో కూడా వస్తుంది. ఇది కాకుండా Vivo T3x పెద్ద 6000mah బ్యాటరీని కలిగి ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.