Last Updated:

Maruti Suzuki Wagon R: అందరినీ వెనక్కి నెట్టేసింది.. ఏంటి గురూ ఇలా కొనేస్తున్నారు.. సేల్స్ చూస్తే మతిపోతుంది..!

Maruti Suzuki Wagon R: అందరినీ వెనక్కి నెట్టేసింది.. ఏంటి గురూ ఇలా కొనేస్తున్నారు.. సేల్స్ చూస్తే మతిపోతుంది..!

Maruti Suzuki Wagon R: ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా అమ్ముడైన  కార్ల జాబితా వచ్చేసింది. ఈసారి మళ్లీ మారుతి సుజికి టాప్-10 కార్ల జాబితాలో చేరింది. ఈ జాబితాలో మరోసారి మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కారు భద్రతలో పూర్తిగా సున్నా అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఫ్లాప్‌గా నిలిచింది. ఈ కారు పెద్దల భద్రతలో ఒక స్టార్ రేటింగ్‌ను పొందగా, పిల్లల భద్రతలో జీరో స్టార్ రేటింగ్‌ను సాధించింది. అయితే ఇప్పటికీ వినియోగదారులు ఈ కారును పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.

ఈసారి వ్యాగన్-ఆర్ అమ్మకాల్లో అందరినీ వెనక్కు నెట్టింది. గత నెలలో ఈ కారు 24,078 యూనిట్లు అమ్ముడయ్యాయి. బాలెనో రెండో స్థానంలో కొనసాగుతోంది. బాలెనో గత నెలలో 19,965 యూనిట్లను విక్రయించగా, హ్యుందాయ్ క్రెటా మూడవ స్థానంలో ఉంది. ఈ వాహనం18,522 యూనిట్లు ఒక నెలలో అమ్ముడయ్యాయి. భారతదేశంలో వ్యాగన్ఆర్ ఎందుకు ఎక్కువగా అమ్ముడవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం?

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ధర రూ.5.54 లక్షల నుంచి మొదలై, రూ.7.25 లక్షల వరకు ఉంటుంది. ఇందులోని స్థలం చాలా అద్భుతంగా ఉంది. నగరంలో నడపడం చాలా సులభం అవుతుంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4-స్పీకర్‌లతో నావిగేషన్, ప్రీమియం సౌండ్‌తోఉంది. భద్రత కోసం ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్-ఆర్‌లో 1.0లీటర్,  1.2లీటర్ పెట్రోల్ ఇంజన్‌లు ఉన్నాయి. ఇది కాకుండా వ్యాగన్-R లో CNG ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ కారు కిలోకి 34.04 కిమీ మైలేజీని ఇస్తుంది. ఇందులో ఆటోమేటిక్, మాన్యువల్ అనే రెండు ట్రాన్స్‌మిషన్లు ఉన్నాయి. రెండు ఇంజన్లు ప్రతి పరిస్థితిలో మెరుగ్గా పనిచేస్తాయి.