Best CNG Cars: బెస్ట్ సిఎన్‌జి కార్లు.. వీటిలో ప్రయాణం చాలా చవక.. పెట్రోల్ అక్కర్లేదు..!
Best CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల కారణంగా దేశంలో సిఎన్‌జి కార్లకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ ఆధారంగా చాలా పెట్రోల్ పవర్డ్ మోడళ్లను ఆటో కంపెనీలు సిఎన్‌జి వెర్షన్‌లను విడుదల చేస్తున్నాయి. CNG మోడల్స్ పెట్రోల్ మోడల్‌లతో పోలిస్తే కొంచెం ఖరీదైనవి. కానీ మీరు మైలేజీ, మెయింటెనెన్స్ పరంగా డబ్బు ఆదా చేయచ్చు. మీ బడ్జెట్ రూ.9 లక్షల కంటే తక్కువగా ఉంటే ఈ కథనాన్ని తప్పకుండా చదవండి. మీ బడ్జెట్‌లో అత్యుత్తమ CNG కార్లను చూద్దాం.
1. మారుతి సుజుకి ఫ్రాంక్స్
మారుతి సుజుకి తన ఫ్రాంక్స్ సిఎన్‌జిని 1.2 సిగ్మా వేరియంట్‌లో అందిస్తోంది. ఫ్రాంక్స్ ధర రూ. 8.46 లక్షల ఎక్స్-షోరూమ్. ఒక్కో కేజీ సీఎన్‌జీకి 28.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంది, అలానే 6 ఆకర్షణీయమైన కలర్స్‌లో కారును మీ సొంతం చసుకోవచ్చు.
మారుతి ఫ్రాంక్ సిగ్మా CNG అనేది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ , పవర్ విండోస్ రియర్, పవర్ విండోస్ ఫ్రంట్, వీల్ కవర్స్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న 5 సీట్ల కారు. ప్రస్తుతం మారుతీ సుజుకి అత్యుత్తమ CNG కారుగా ఫ్రాంక్‌ని గుర్తింపు ఉంది.
2. టాటా పంచ్
టాటా పంచ్ 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో మైక్రో SUV, CNG వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ CNG వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. పంచ్ ధర రూ. 7.23 లక్షల ఎక్స్-షోరూమ్. కిలో సిఎన్‌జికి 26.99 కిమీ మైలేజీని ఇస్తుంది.
టాటా పంచ్ ప్యూర్ సిఎన్‌జి మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1199 సిసి ఇంజన్‌తో పనిచేస్తుంది. టాటా పంచ్ ప్యూర్ CNG అనేది యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ , పవర్ విండోస్ ఫ్రంట్‌తో కూడిన 5 సీట్ల కారు.
3. హ్యుందాయ్ ఎక్స్‌టర్
విశాలమైన క్రాస్ఓవర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ ఎక్స్‌టర్ SX వేరియంట్ CNG ఎంపికలో అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ. 8.43 లక్షల ఎక్స్-షోరూమ్ ఇండియా. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ సిఎన్‌జి కిలోకు 27.1 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ SX CNG అనేది మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్ ఎక్స్‌టర్నల్ రియర్ వ్యూ మిర్రర్, టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పవర్ విండోస్ రియర్, పవర్ విండోస్ ఫ్రంట్, వీల్ కవర్‌లతో కూడిన 5 సీట్ల కారు.