Top Selling Premium Phones: భారత్‌లో టాప్ సెల్లింగ్ మొబైల్ బ్రాండ్లుగా ఆపిల్, సామ్‌సంగ్.. వివో, ఒప్పో, పోకో, రియల్‌మి పరిస్థితి ఏంటో తెలుసా..?
Top Selling Premium Phones: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల సేల్స్‌లో ఆపిల్, సామ్‌సంగ్ కంపెనీలు మరోసారి తమ మార్క్‌ను చూపించాయి. ఒప్పో, వివో, షియోమి, వన్‌ప్లస్, రియల్‌మి బ్రాండ్లను దగ్గరికి కూడా రాకుండా చేశాయి. ఈ కంపెనీల ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో పోలిస్తే భారతీయ వినియోగదారులు ఆపిల్, సామ్‌సంగ్ ఫోన్లపై విశ్వాసం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, చైనీస్ కంపెనీల ప్రభావం ఇప్పటికీ మిడ్ రేంజ్ బడ్జెట్ పరిధిలోనే ఉంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా బ్రాండ్‌లు 60 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. అదే సమయంలో ప్రీమియం విభాగంలో ఈ బ్రాండ్ల వాటా 6 శాతం మాత్రమే.
ఇటీవల నివేదిక ప్రకారం.. రూ. 50 వేలు లేదా అంతకంటే ఎక్కువ సెగ్మెంట్‌లో ఆపిల్, సామ్‌సంగ్ ఏకైక ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ విభాగంలో ఈ రెండు కంపెనీల మార్కెట్ వాటా 94 శాతం వరకు ఉంది. సంవత్సరం ప్రారంభంలో వాటి మార్కెట్ వాటా 90 శాతంగా ఉంది, ఇది సంవత్సరం చివరి నాటికి 4 శాతానికి పెరిగింది. ఈ రెండు కంపెనీలు కాకుండా, ఈ విభాగంలో వన్‌ప్లస్ మార్కెట్ వాటా 2.4 శాతంగా ఉంది. ఇది 3.4 శాతంతో పోలిస్తే 1 శాతం తగ్గింది.
వన్‌ప్లస్‌తో పాటు ఇతర చైనా కంపెనీల మార్కెట్ వాటా కూడా ఈ విభాగంలో పడిపోయింది. వివో మార్కెట్ వాటా 0.8 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గింది. భారతదేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ సంవత్సరానికి 85 శాతం వృద్ధిని చూస్తోంది. అయినప్పటికీ, చైనీస్ బ్రాండ్ల మార్కెట్ వాటా పడిపోతుంది. యాపిల్, సామ్‌సంగ్‌తో పాటు గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా భారతీయ వినియోగదారులు ఇష్టపడటం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా కంపెనీల సమస్యలు మరింత పెరగనున్నాయి.
ప్రీమియం సెగ్మెంట్లో వినియోగదారులు ఎక్కువగా ఆపిల్ ఐఫోన్లు, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే మిడ్ బడ్జెట్ సెగ్మెంట్లలో ఇది కాదు. ఈ విభాగంలో చైనా కంపెనీ వివో ముందంజలో ఉంది. దీని తర్వాత షియోమి, ఒప్పో, పోకో, రియల్‌మి, రెడ్‌మి వంటి బ్రాండ్లు ఉన్నాయి. ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ కంపెనీల ఫోన్‌లు చాలా తక్కువ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. భారతీయ మొబైల్ మార్కెట్ గురించి మాట్లాడితే చైనీస్ బ్రాండ్ వివో గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో ఉంది.