Home / Ycp government
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా వైకాపా పై నిప్పులు చెరుగుతున్నారు. కాగా ఇటీవలే పవన్ తన ప్రచార రధం " వారాహి " కి సంబంధించిన వీడియోని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. అప్పటి నుంచి వైకాపా నేతలు వివాదాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారాహికి ఉన్న రంగు గురించే ఈ చర్చ అంతా నడుస్తుంది.
యోగి వేమన యూనివర్శిటీలో అధికారులు యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్దానంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అధికారుల అత్యత్సాహం పై పలువురు మండిపడుతున్నారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సర్కార్ పరోక్షంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇటీవల రోడ్డు విస్తరణ కోసం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారడం. బాధితులకు పవన్ అండగా నిలిచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వానికి పవన్ మాస్ వార్నింగ్
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుందన్నారు.
మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చర్చకు మీరు సిద్ధమా అంటూ మంత్రి రోజా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
సివిల్ తగాదాకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సెంటు స్థల వివాదాన్ని సాకుగా చూపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున వందమంది పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్టు చేయడం అమానుషమని మండిపడ్డారు.
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
అధికార పార్టీ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వైసిపి కార్యకర్తలు మనోవేదనలకు గురౌతున్నారని దర్శి వైకాపా శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వైకాపా ప్లీనరీలో మాట్లాడిన అంశాలు నేడు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి.