Home / Ycp government
మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చర్చకు మీరు సిద్ధమా అంటూ మంత్రి రోజా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
సివిల్ తగాదాకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సెంటు స్థల వివాదాన్ని సాకుగా చూపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున వందమంది పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్టు చేయడం అమానుషమని మండిపడ్డారు.
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
అధికార పార్టీ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వైసిపి కార్యకర్తలు మనోవేదనలకు గురౌతున్నారని దర్శి వైకాపా శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వైకాపా ప్లీనరీలో మాట్లాడిన అంశాలు నేడు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి.
రాజధానిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. వికేంద్రీకరణ ఆలోచనపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేనికీ గర్జనలు అంటూ ట్విట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో విలువైన ఇనుప ఖణిజాలను పరులు పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందని, ఏపి ఎండీసి ద్వార ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ఓబులాపురం గనుల దోపిడి పార్ట్ 2 ప్లాన్ కు వైకాపా ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు