Home / Yadadri Temple
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అయ్యాయి.
కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీనితో ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో దాదాపుగా లక్షమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దీనితో ఆదివారం ఒక్కరోజే రూ.1.09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు
బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రిలో స్నానం చేసి తడిసిన దుస్తులతో లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత ప్రమాణం చేశారు.
సూర్యగ్రహణం కారణంగా మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు దేవాలయాలు మూతపడనున్నాయి. భక్తులకు తిరిగి బుధవారం దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే యాదాద్రీశుడి దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నట్టు అధికాలు తెలిపారు.
నేడు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు ముఖ్యమంత్రి బయల్దేరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే రోడ్డు మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలులో ఉంచారు.
నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.శుక్రవారం రోజు కేసీఆర్ దంపతులు లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.అంతేకాకుండా సీఎం కేసీఆర్ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని కానుకగా ఇవ్వనున్నారని తెలిసిన సమాచరం.సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి బంగారు లాకెట్ల విక్రయాలు గత 2రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారి రూపం, సుదర్శన నారసింహ యంత్రాన్ని లాకెట్ రూపంలో తయారు చేసి విక్రయించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది.