Last Updated:

Yadadri temple: యాదాద్రి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం..

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో దాదాపుగా లక్షమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దీనితో ఆదివారం ఒక్కరోజే రూ.1.09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు

Yadadri temple: యాదాద్రి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం..

Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. కార్తీక మాసం, ఆ.దివారం సెలవుదినం కావడంతో దాదాపుగా లక్షమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దీనితో ఆదివారం ఒక్కరోజే రూ.1.09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు యాదాద్రిని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం రూ. కోటికి పైగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

వివిధ సేవలు, కౌంటర్ విభాగాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000, వీఐపీ దర్శనం టిక్కెట్లతో రూ.22,62,000, వ్రతాల ద్వారా రూ. 13,44,000, కొండ పైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000, బ్రేక్ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 6,95,000 సహా వివిధ సేవల ద్వారా ఈ ఆదాయం సమకూరిందని తెలిపారు.

ఆదివారం తెల్లవారుజామునుండే, యాదాద్రి క్షేత్రం వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తలు పలు రకాల ‘ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలో, ఆదాయం రూ.1.20 కోట్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి: