Home / Visakhapatnam
విశాఖపట్నం కేజీహెచ్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీషను కుటుంబసభ్యులు కేజీహెచ్ ప్రసూతివిభాగంలో చేర్పించారు.
ఏపీలో రుషికొండ మహల్ హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖలో నివాసముంటాననుకున్న మాజీ సీఎం జగన్ ఇంటి ఆర్భాటాలు విస్మయపరుస్తున్నాయి. ఇదేదో సాదాసీదా భవనం కాదు.
ఉద్యోగాల పేరుతో కాంబోడియాలో మోసపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు శనివారం ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు క్షేమంగా చేరుకున్నారు. విశాఖకు చెందిన 20 మందికిపైగా బాధితులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
: విశాఖపట్టణం లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు . ఈ బస్సులను శనివారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు.
విశాఖపట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పదిమంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్టణంలో నివసిస్తున్న ఒడిశాకి చెందిన 17 ఏళ్ళ బాలికని భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు.
విశాఖపట్నంలో వైసీపీ అక్రమాలపై పోరాడితే జనసేన పార్టీ కార్పోరేటర్ మూర్తి యాదవ్‌ను చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు.
అత్తారింటికి దారేదో తెలిసింది కానీ.. ఏపీ రాజధానికి దారి తెలియడంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని ఎక్కడుందో కేంద్రంలో ఉన్నవాళ్లు చెప్పాల్సి వస్తోందని అన్నారు. ఈ రోజుకు ఏపీకి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి ఏందపి పవన్ మండిపడ్డారు.
నేను ఎప్పుడూ మిమల్ని ఓటు బ్యాంకుగా చూడలేదు. మీ కష్టాల్లో నేను ఉన్నాను. మీకు అండగా నిలబడతాను అంటూ విశాఖ మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదంలో బోట్లు కాలిపోయి, నష్టపోయిన మత్స్యకారులకు ఆయన ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ వారిని ఉద్దేశించి ప్రసంగింమచారు.
డిసెంబర్ లోగా విశాఖకు మారతామని ఇక్కడినుంచే పరిపాలన కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం వివాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతానని, పరిపాలనా విభాగం మొత్తం విశాఖకు మారుతుందని చెప్పారు.
సాధారణంగా పాలకులు ప్రజలకు ఉపయోగపడే, వారి జీవితాలను మెరుగుపరిచే నిర్ణయాలను తీసుకున్నపుడు ప్రజలు వారిపై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటారు. వీటిలో భాగంగా ఫోటోలకు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, పూజలు చేయడం పరిపాటి. అయితే విశాఖ మహిళలు మాత్రం దీనికి భిన్నంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లిక్కర్ తో అభిషేకం చేసి తమ నిరసన చాటారు.