Home / Visakhapatnam
విజయదశమినుంచి విశాఖనుంచే ప్రభుత్వ పాలన సాగుతుందని ఏపీ సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గురువారం జరిగిన కేబినేట్ భేటీలో సీఎం జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. దసరా పండుగ విశాఖలోనే జరుపుకుందామని.. ప్రస్తుతానికి సిఎంఓ తరలిస్తామని మంత్రులకి జగన్ చెప్పారు.
విశాఖలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన బాలిక ఇటీవల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ప్రశాంతమైన విశాఖ నగరం భూకబ్జాదారుల, రియల్లర్ల, గూండాల చేతిలో చిక్కుకుని అల్లాడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఆయన ప్రసంగించారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 10వ తేదీ నుంచి విశాఖ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. యాత్రలో భాగంగా 6 ఫీల్డ్ విజిట్స్ , 2 బహిరంగ సభలు, ఒక జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.
విశాఖపట్టణంలో పద్నాలుగేళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు 20 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని 104 ఏరియా బాపూజీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం, కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండడం, చదువులో శ్రద్ధ తగ్గడం వంటివి గమనించిన తల్లి గట్టిగా నిలదీసింది
విశాఖపట్నంలో ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, ఆయన కుమారుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని.. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.
విశాఖలో సగం తవ్విన రుషికొండపై గ్రీన్‌మ్యాట్ కప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది.
ట్రైన్ దిగుతున్న సమయంలో జారిపడి ఒక యువతి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది.
విశాఖ మధురవాడలో రెండు రోజుల కిందట కలకలం రేపిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు.