CM Jagan Comments: త్వరలోనే నేను విశాఖకు షిప్ట్ అవుతా.. సీఎం జగన్
డిసెంబర్ లోగా విశాఖకు మారతామని ఇక్కడినుంచే పరిపాలన కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం వివాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతానని, పరిపాలనా విభాగం మొత్తం విశాఖకు మారుతుందని చెప్పారు.
CM Jagan Comments: డిసెంబర్ లోగా విశాఖకు మారతామని ఇక్కడినుంచే పరిపాలన కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం వివాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతానని, పరిపాలనా విభాగం మొత్తం విశాఖకు మారుతుందని చెప్పారు.
ఐటీ హబ్ గా విశాఖ..(CM Jagan Comments)
విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని సీఎం జగన్ అన్నారు. విశాఖలో ఎన్నో విద్యాసంస్దలు ఉన్నాయని ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ గా తయారయిందన్నారు. విశాఖలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అందుకే పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్దలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. కంపెనీలకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తామని చెప్పారు. అనంతరం సీఎం జగన్ పరవాడ్ సెజ్ లో ఫార్మా యూనిట్ ను ప్రారంభించారు. తరువాత అచ్యుతాపురం లో లారస్ కంపెనీ రెండవ యూనిట్ ను జగన్ ప్రారంభించారు. రూ.460 కోట్లతో ప్రారంభించిన ఈ యూనిట్ తో 1200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. సీఎం జగన్ పర్యటనలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు,, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ,, మంత్రి గుడివాడ అమర్ నాధ్ , విశాఖ ఎంపీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.