Home / Visakhapatnam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు విశాఖ పోలీసులు 41ఏ నోటీసులిచ్చారు. పవన్ విశాఖలోనే ఉంటే శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదముందని నాలుగు గంటల్లో నగరం విడిచి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్లపై రాళ్ల దాడి కేసులో జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు.
: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు.
3 రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో విశాఖ గర్జనకు పిలుపునిస్తున్నామని రాష్ట్ర మంత్రులు పదే పదే పేర్కొన్నారు.
పక్కా ప్లానింగ్‌తో జనసేనాని పావులు కదుపుతున్నారా? భయం తన బ్లడ్‌లో లేదని నిరూపించేందుకే ఫిక్స్ అయ్యారా? సంఖ్యాబలం కన్నా సంకల్ప బలమే గొప్పదని నిరూపించబోతున్నారా? విశాఖలో వైసీపీ నడిపిస్తున్న గర్జన రోజునే పవన్ కల్యాణ్ టూర్ ఫిక్స్ చేయడంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. కాగా తాజాగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, వదంతులను నమ్మవద్దని కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ అన్నారు. బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తైందని ఆయన చెప్పారు.
విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రైల్వే జోన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారన్నారు. నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ గురించి చర్చకు రాలేదన్నారు.
ఆంధ్రప్రదేశ బార్డర్ సమీపంలో ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని దంతెవాడ- కిరండూల్ సెక్షన్లో వెళ్తోన్న రైలును మావోలు హైజాక్ చేశారు. కేవీఎస్ 11 నంబర్ గూడ్స్ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు విడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి వేరవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.