Home / Union minister Kishan Reddy
మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో తెలంగాణాలో రాజకీయ వార్ రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్, భాజాపా నేతల మద్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఓ వైపు కేంద్రం పై కేసిఆర్ కాలుదువ్వుతుంటే, మరో వైపు భాజపా కేసిఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు.ఇందులో భాగంగా సిటీలో వందలాది మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభించారు
కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, అందరూ తన వెనుక ఉన్నారనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని, అయితే అది అంత సులభం కాదన్నారు.
దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఆడపడుచులు రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు.