Home / Union Budget 2023-24
Budget 2023-24: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఈ బడ్జెట్‌లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన కేటాయింపులు జరగలేదు. కేవలం కొన్ని కేటాయింపులకు మాత్రమే ప్రకటనలు వెలువడ్డాయి.
ఆర్థిక మంత్రి హోదాలో లోక్‌సభలో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. దీంతో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఆమె ఘనత సాధించారు.
PAN Card: నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధికశాఖ మంత్రి.. నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. డిజిటల్ లావాదేవీలకు.. పాన్ కార్డును సాధారణ గుర్తింపు కార్డుగా పరిగణించనున్నట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2023 - 24 కేంద్ర బడ్జెట్ ను ఆమె సమర్పించారు. ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ ఐదోసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇక్కడ విశేషం. ప్రతీసారి లాగే ఈసారి కూడా నిర్మల సీతారామన్ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. సంప్రదాయ చీరకట్టులో ఆమె పార్లమెంటుకు హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం వినిపించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Nirmala Seetharaman:కేంద్ర బడ్జెట్ సందర్భంగా.. పార్లమెంట్ లో కాసేపు నవ్వులు విరబూశాయి. బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్ధిక మంత్రి సీతారామన్ టంగ్ స్లిప్ అయ్యారు. పొరపాటున నోరు జారడంతో.. ఒక్కసారిగా లోక్‌సభలో నవ్వులు విరిశాయి.
Union Budget 2023-2024: నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2023-24 ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవార ఉదయం 11 గంటలకు లోక్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ (Union Budget2023-24)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.