Union Budget 2023-24: 2 గంటల 42 నిమిషాల నుంచి 86 నిమిషాలకు.. బడ్జెట్ లో నిర్మలమ్మ రికార్డులు
ఆర్థిక మంత్రి హోదాలో లోక్‌సభలో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. దీంతో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఆమె ఘనత సాధించారు.
Union Budget 2023-24: ఆర్థిక మంత్రి హోదాలో లోక్‌సభలో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.
దీంతో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఆమె ఘనత సాధించారు.
2019 లో ఆర్థిక మంత్రి గా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్. . అదే ఏడాది పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచారు.
అదే ఏడాది కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆమె ఆ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.
గతంలో 1970-71 లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఇందిరా గాంధీ తొలి మహిళగా చరిత్రకెక్కారు.
గత నాలుగేళ్లుగా బడ్జెట్ ప్రవేశ పెడుతున్న 63 ఏళ్ల నిర్మలమ్మ ఈ సారి అతి తక్కువ సమయం (86 నిమిషాలు) ప్రసంగించారు.
అయితే గతంతో పోలిస్తే ఈ సారి ఆమె బడ్జెట్ ప్రసంగం త్వరగా ముగించారు.
2023-24 బడ్జెట్ ను 16,236 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు నిర్మలమ్మ.
గత బడ్జెట్ ప్రసంగాలు (Union Budget 2023-24)
2019-20 లో 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు నిర్మలా సీతారామన్ ( Nirmala Setharaman). అపుడు 2003 లో ఆర్థిక మంత్రి గా పనిచేసిన జశ్వంత్ సింగ్ 2 గంటల 15 నిమిషాల ప్రసంగాన్ని నిర్మల బద్దలు కొట్టారు.
తర్వాత 2020-21 లో దేశ సుధీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా రికార్డు కెక్కారు. అపుడు 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించారు నిర్మలా సీతారామన్. అయితే కాస్త అస్వస్థత ఉండటంతో మిగిలిన
రెండు పేజీలు చదివినట్టుగా భావించాలని కోరారు.
2021-22 లో 1 గంటా 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
2022-23 లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం 1 గంటా 32 నిమిషాలు కొనసాగింది. సాధారణంగా బడ్జెట్ ప్రజంటేషన్ నిడివి 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు గా ఉంటుంది.
ఈ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పన్ను, ఆదాయం, ఆర్థిక పదాలు, రాష్ట్రాలు, అభివృద్ధి.. వంటి పదాలను ఎక్కువగా ఉపయోగించారు. పన్ను అనే పదాన్ని ఎక్కువగా 51 సార్లు పలికారు.
బడ్జెట్ లెక్కలు (Union Budget 2023-24)
ఇక కేంద్ర బడ్జెట్ 2023-24 లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2023-24 మొత్తం బడ్జెట్ విలువ రూ. 45 లక్షల కోట్లు. ప్రభుత్వ అప్పులు రూ. 11.8 లక్షల కోట్లు.
ట్యాక్సుల రూపంలో వచ్చే ఆదాయం రూ. 33.61 లక్షల కోట్లు, కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ. 10.22 లక్షల కోట్లు, ఆదాయ పన్నుల రూపంలో రూ. 9.01 లక్షల కోట్లు,
జీఎస్టీ ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం రూ. 9.57 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 5.9 శాతం ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news