Home / Trs party
రాజకీయ నాయకులు ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటెయ్యమంటారని ఇప్పటివరకు అందరూ వింటుంటారు. అయితే అది నేరుగా వినేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి ఓ ఆడియో తెలంగాణ కాంగ్రెస్ లో పెనుదుమారం లేపుతుంది.
భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల్లో విషపు మొక్కలు నాటుతోందని తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న భారత జోడో యాత్రలో భాగంగా ఆమె ఆదోని మండలంలో రాహుల్ తో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై తెరాస హైకోర్టు మెట్లెక్కింది. కారు గుర్తును పోలిన గుర్తులు తొలగించాలని ఎన్నికల సంఘాన్ని తెరాస ఇప్పటికే కోరింది
అది తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా. టీఆర్ఎస్కు మంచి పట్టు ఉన్న జిల్లా. అయితే.. ఆ జిల్లా నుంచి పలువురు నాయకులు టీఆర్ఎస్ను వీడటం చర్చనీయాంశంగా మారింది.
తెరాస నేతలు అత్యుత్సాం చూపించారు. భారత దేశ మ్యాప్ లో జాతీయ రంగులతో పాటు సీఎం కేసిఆర్ ఫోటోను ముద్రించి ఆయనపై ఉన్న తమ అభిమానాన్ని నేతలు చాటుకొన్నారు. దాన్ని ఫ్లెక్సీపై ముద్రించి సోమాజీగూడ సిగ్నల్ వద్ద హోర్డింగ్ రూపంలో ఏర్పాటు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా, పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఎక్కువమంది ప్రతిపాదించారు.
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్నారు. ఆయనతోపాటు తన భార్య, మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్మన్ భాగలక్ష్మీతో సహా మంత్రి కేటిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి కేటిఆర్ వారిని ఆహ్వానించారు.
యావత్ దేశ ప్రజానికం ఇప్పుడు తెలంగాణవైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నేడు ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు హైదరాబాద్ చేరుకుని కేసీఆర్కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుతున్నారు.
దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే మాట్లాడకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా, అలాగైతే ఎస్సీ, ఎస్టీ కేసులు అందరి మీద పెట్టే దమ్ముందా అని వైఎస్ఆర్టీపి నాయకురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు
సారూ...దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు..మజా చేసుకోండి..కుషీగా ఉండండి అంటూ అధికార పార్టీ నేతలు బహిరంగంగా మద్యం, కోళ్లను ఉచితంగా పంచి పెట్టిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకొనింది.