Congress MP Audio Leak: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్..గందరగోళంలో పార్టీ శ్రేణులు
రాజకీయ నాయకులు ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటెయ్యమంటారని ఇప్పటివరకు అందరూ వింటుంటారు. అయితే అది నేరుగా వినేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి ఓ ఆడియో తెలంగాణ కాంగ్రెస్ లో పెనుదుమారం లేపుతుంది.
Telangana: రాజకీయ నాయకులు ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటెయ్యమంటారని ఇప్పటివరకు అందరూ వింటుంటారు. అయితే అది నేరుగా వినేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి ఓ ఆడియో తెలంగాణ కాంగ్రెస్ లో పెనుదుమారం లేపుతుంది.
టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో తన కార్యకర్తతో ఫోన్లో మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం చోటుచేసుకొనింది.
ఓ కాంగ్రెస్ లీడర్‌తో కోమటిరెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వాయిస్ గా భావిస్తున్నమేర అందులో, మునుగోడు ఉప ఎన్నిక దెబ్బతో నేను పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా అంటూ కాంగ్రెస్ ఎంపీ ఫోన్ కాల్లో సంభాషణ వినిపించింది. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా.. అధికారంలోకి తీసుకొస్తా… పార్టీలను చూడొద్దు.. రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా. చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
అసలు ఇలాంటి వెన్నుపోటు దారుల వల్లే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చతికలబడింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారిన ఈ ఆడియోపై స్పందించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందుబాటులో లేకుండాపోయారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ ఎంపీ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. పది రోజుల హాలిడే ట్రిప్ లో ఆయన ఉండనున్నారు.
ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం అధిష్టానానికి చేరవేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. వెంకట్ రెడ్డి ఆడియో క్లిప్‌ను కూడా వారికి పంపారు. ఇటు కోమటిరెడ్డి ఆడియోపై ముగుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సున్నితంగా తోసిపుచ్చారు. ఆడియోపై ఇప్పుడే మాట్లాడడం సబబుకాదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో నా పార్టీ, నా గెలుపుకోసం తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన భుజస్కందాలపై వేసుకొని తిరుగుతున్నారు. తన చెల్లి పోటీ చేస్తుందనే బాధ్యతతో రేవంత్, ఉత్తమ్, భట్టి లాంటి నాయకులు కూడా నాకోసం పని చేయడం చాలా సంతోషంగా ఉందని స్రవంతి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:Telangana Congress: తగ్గేదేలే, భారత జోడో యాత్రలో రాహుల్ కు తోడుగా లక్ష మంది ప్రజలతో పాదయాత్రకు సిద్దమౌతున్న తెలంగాణ కాంగ్రెస్