Last Updated:

Munugode By-poll: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా, పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఎక్కువమంది ప్రతిపాదించారు.

Munugode By-poll: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Hyderabad: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా, పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఎక్కువమంది ప్రతిపాదించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టులను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

యాదాద్రి జిల్లా నారాయణ పురం మండలం లింగంవారిగూడేనికి చెందిన ప్రభాకరరెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేసారు. కేసీఆర్ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. 2003 నుంచి టీఆర్ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఇంచార్జి గా టీఆర్ఎస్ గెలుపుకు పనిచేసారు. 2104 లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మునుగోడు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు.

మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. 15న నామినేషన్లను పరిశీలించనున్నారు. 17 వరకు నామినేషన్ పత్రాల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నవంబర్‌ 3న పోలింగ్‌ జరుగనుంది. అదేనెల 6న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి: