Home / Tollywood News
కార్తికేయ హీరో బెదురులంక 2012 అనే చిత్రం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమా పేరును ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం.
లైగర్ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో ఈ చిత్ర దర్శక నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మీలను అధికారులు విచారించారు. కాగా తాజాగా నేడు ఈ సినిమా హీరో అయిన విజయ్ దేవరకొండను కూడా విచరణకు పిలిపించారు.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB28 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రష్మికను తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.
కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "నేనెవరు"
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. తాను మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నానని కొన్ని రోజుల క్రితం సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. సమంత ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుందనే వార్త తమిళనాడులో తెగ చక్కర్లు కొట్టింది.
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి బాస్ పార్టీ (Boss Party) అంటూ తొలి పాటను విడుదల చేశారు చిత్రబృందం.
అడివి శేష్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మిస్తున్న సినిమా 'హిట్ 2'. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరి నటించింది. డిసెంబర్ 2వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా నుంచి రేపు (నవంబరు 23) ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఆ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది.
ప్రస్తుతం కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు.