Meenakshi Chaudhary Photos: గోల్డ్ కలర్ డ్రెస్ లో మీనాక్షీ.. భలే ఉందే..!

అందాల భామ మీనాక్షీ చౌదరీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో మీనాక్షీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా వరుస అవకాశాలను అయితే మీనాక్షీకి బాగానే అందించింది.

మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూ కారం మీనాక్షీ లైఫ్ ను మార్చేసింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించినా.. శ్రీలీల కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది మీనాక్షీనే.

గుంటూరు కారం తరువాత లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన మీనాక్షీ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా మీనాక్షీ గోల్డ్ కలర్ డ్రెస్ లో అదరగొట్టేసింది. గోల్డ్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో అమ్మడు కనిపించింది.

ప్రస్తుతం మీనాక్షీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మీనాక్షీ అందానికి ఫిదా అయిన అభిమానులు సూపర్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.