Home / Tollywood News
పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల సినిమాలని చాలా స్లోగా చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్, క్రిష్ జాగర్లమూడీ దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా హరిహరవీరమల్లు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
Panchatantram Movie Review: కొన్ని చిన్న కథల సమాహారంగా( ఆంథాలజీ) సినిమాలు తీయడం ఇటీవల కాలంలో ట్రెండ్ అవుతుంది. ఓటీటీ వేదికగా ఈ తరహా చిత్రాలు ఎక్కువగా తెరకెక్కాయి. కానీ పెద్ద స్క్రీన్ పై మాత్రమే ఇలాంటి ఆంథాలజీ స్టోరీలు వస్తుంటాయి. కాగా బ్రహ్మానందం ముఖ్య పాత్రలో స్వాతి, సముద్రఖని, ఉత్తేజ్ తదితర నటీనటులు ప్రధాన పాత్రలో నటింటి ఆంథాలజీగా తాజాగా తెలుగులో ‘పంచతంత్రం’ పేరుతో సినిమా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు […]
వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కోసం తాజాగా మెగాస్టార్ చిరంజీవి విదేశాలకు బయలుదేరాడు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, కూతురు సుష్మిత పిల్లలు కూడా వెళ్లారు. అయితే తన ఫారిన్ ట్రిప్ విషయాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ మెగాస్టార్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర..’ అంటూ ఫొటోకు క్యాప్షన్ కూడా జోడించారు మెగాస్టార్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సరోగసి నేపథ్యంలో నటించిన లేటెస్ట్ చిత్రం యశోద. లేడీ ఓరియంటెడ్ గా సాగే ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 9నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుబాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్ లో ఘోర సంస్థ తాజాగా క్షమాపణలు చెప్పింది. లగేజ్ మిస్ విషయమై ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై రానా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లగేజ్ మిస్ అయిందని, అక్కడి సిబ్బంది దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్వీట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోహైల్ ను హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. అయితే, తన పెళ్లిలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు కూడా హన్సిక ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. మరి వారెవరో తెలుసా..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మెహరీన్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాస్త భయంగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫొటోలో మెహరీన్ ముఖం మొత్తం సూదులతో నిండిపోయింది. మొహం నిండా సూదులు గుచ్చుకొని ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు పోజిచ్చింది.
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది ఇదే రోజున విడుదలై అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ అఖండ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. అప్పుడే ఏడాది అయ్యిందంటే నమ్మలేకపోతున్న అంటూ రాసుకొచ్చింది.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటి చిన్న సినిమాల జాబితాలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మరో మూవీ 'ముఖ చిత్రం'. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. అయితే విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు విజయ్ మాట్లాడారు. విచారణపై స్పందిస్తూ పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే అని రౌడీ బాయ్ వ్యాఖ్యానించారు.