Home / Tollywood News
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలయ్యింది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.
నేటి సినిమా రంగంలో అశ్లీలత పెరిగి కుటుంబసమేతంగా సినిమాలు చూడలేని పరిస్ధితి ఏర్పడింది. దీంతోపాటు ఆధ్యాత్మిక అంశాలకు సైతం అశ్లీలత జోడించి డబ్బులు సంపాదించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనను నిరసిస్తూ హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది.
సినీ నటుడు అలీ బుధవారం సీఎం జగన్ ను తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు. ఇటీవలే అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సీఎం జగన్ నియమించారు. దీనికి గాను అలీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సీఎంకు కృతజ్జతలు తెలిపారు.
ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు నాగార్జున నటించిన 'గాడ్ ఫాదర్' మరియు ‘ది ఘోస్ట్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను నమోదు చేశాయి. అయితే ఈ చిత్రాలు తాజాగా ఓటీటీ వేదికగానూ అలరించనున్నాయి.
టాలీవుడ్ లో ఒకటీ రెండూ కాదు ఏకంగా పదిసినిమాలు విడుదలవుతన్నాయి. ఈ వారంలో దాదాపు పది చిత్రాలు నవంబర్ 4న విడుదలవుతున్నాయి.
మొదటి సీజన్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలయ్య. ఇక ఈ వారం జరిగే మూడో ఎపిసోడ్‌కు క్లాస్ హీరోలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ అయిన శర్వానంద్, అడివి శేష్‌లు గెస్టులుగా వచ్చారు. ఇంకేముంది వారితో బాలయ్య బాబు ఓ రేంజ్ ఆడుకున్నాడనుకోండి.
సూపర్ స్టార్ కుటుంబం నుంచి వచ్చినా.. ఆ పేరును ఏమాత్రం తగ్గించకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధీర్‌బాబు. ఇటీవల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరో తాజాగా మరో ఆసక్తికర కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. కాగా ఈ యంగ్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. అయితే ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మూవీమేకర్స్ వెల్లడించారు.
తనకు ప్రాణాంతకమైన ‘మైయోసిటీస్’ అనే వ్యాధి ఉన్నట్లు సమంత ఇన్ స్టాగ్రామ్ లో షాకింగ్ విషయం చెప్పింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను వెనుక నుంచి చూపిస్తూ ఫొటో షేర్ చేసింది.