Home / Tirumala Temple
పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఏపీలోని ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని 28న రాత్రి 7.05 నుంచి తెల్లవారుజామున 3.15 వరకు ఆలయాన్ని మూసేస్తారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అక్టోబర్ 28 (2023)న సాయంత్రం 6 గంటల నుంచి 29న తెల్లవారుజామున 3.30 గంటల వరకు మూసివేయనున్నారు.
ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని తిరుమల రెండవ స్థానంలో నిలిచింది.
తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన వేళలను మారుస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. రాత్రి సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం వారికి ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మార్పులు రేపటి నుంచే అమలవనున్నాయి.
డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్వేతపత్రం విడుదల చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్లు, 10,258.37 కేజీల బంగారం ఉన్నట్టుగా టీటీడీ పేర్కొంది.
వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీస్తున్న భక్తులు.
అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటల 11 నిముషాల నుండి 6 గంటల 27 నిముషాల మధ్య సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల 11 నిముషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిముషాల వరకు దర్శనం ద్వారాలు మూసే ఉండనున్నాయి.
తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ప్రాతఃకాల సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.
తిరుమలలో శనివారం అర్ధరాత్రి వరకు 78,833 మంది స్వామి వారిని దర్శించుకోగా, 36,074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీల్లో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
ఈ మధ్య సినీ ఫీల్డ్ లో కొత్త ట్రెండు నడుస్తుంది అది ఏంటంటే సినిమా విడుదల అయ్యే ముందు, విడుదల అయ్యాక, సినిమా మంచి విజయం సాధించినప్పుడు దేవుని ఆశీస్సులు కోసం దేవుని గుళ్ళకు వెళ్తున్నారు. సాధరణంగా అన్నీ సినిమా వర్గాల వారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు.