Home / Telangana News
Crime News : ప్రస్తుత కాలంలో ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై దాడులు జరిగిన ఘటనలను మనం గమనించవచ్చు. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతో మంది అమ్మాయిలు ప్రాణాలు కూడా కోల్పోయిన విషాద ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి.
సర్వసాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు వచ్చే మెషీన్ అని మనకు తెలిసిందే. కాగా పెరుగుతున్న అధునాతన సాంకేతికతో పలురకాల ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ అయ్యి ఇప్పుడు ఏకంగా బంగారాన్ని కూడా ఇచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. భారతదేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను శనివారం హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు.
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగా.. త్వరలోనే గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీకి సర్కార్ నోటిఫికేషన్లను విడుదల చేయనుంది.
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. బేగంపేట పరిధిలోని రసూల్‌పురా-రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది పదిగంటలైనా పొగమంచు వీడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది.
మహబూబాబాద్, వనపర్తిలాంటి మారుమూన ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో ఊహించలేదు.
భాగ్యనగరంలో తెల్లారితే చాలు, ఉరుకులు పరుగులు మీద తమ తమ గమ్యస్ధానాలకు చేరుకొనే సామాన్యులు, ఉద్యోగుల రద్దీతో ప్రధాన మార్గాలు కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో ప్రజలు రోడ్డు, మెట్రో రైలు సేవలను అధికంగా వినియోగిస్తుంటారు. అయితే నేడు ఉదయం చోటుచేసుకొన్న సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైలు సేవలు ఆగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు.
హైదరాబాద్ లో ఈనెల 19, 20వ తేదీల్లో మరియు వచ్చేనెల 10,11వ తేదీల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ రేస్ పోటీలకు హుస్సేన్‌సాగర్ వేదిక కానుంది.
మునుగోడు ఉప ఎన్నికల వేడి నేటితో ముగియనున్న నేపథ్యంలో పలివెల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయిపై తెరాస కార్యకర్తలు రాళ్లదాడి చేశారు.
తెలంగాణ విద్యార్థులకు గమనిక. ఎంసెట్-2022 స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తమకు సీట్లు రాలేదని బాధపడుతున్న విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొందాలనుకునే విద్యార్ధులు వెంటనే అధికారిక వెబ్సైట్లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసకోవాలని హైయర్ ఎడ్యుకేషన్ సూచించింది.