Home / Telangana assembly sessions
Telangana Legislative Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. దీంతో ప్లకార్డులు తీసుకెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం వేశారు. రైతులను .జైల్లో పెట్టడంపై చర్చకు వాయిదా తీర్మానించారు. ఆసిఫాబాద్లో పులి దాడిపై బీజేపీ […]
Telangana Assembly Sessions To Start From December 9: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. పలు కీలక చట్టాల ఆమోదానికి సర్కారు సిద్ధం ప్రతీరోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని […]
Telangana Assembly Sessions Schedule Released: తెలంగాణ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పాలక పక్షం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రజాపాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. చర్చకు రానున్న కీలక బిల్లులు రాబోయే […]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రభుత్వం స్వేత పత్రం విడుదల చేసింది. దాంతో స్వల్ప కాలిక చర్చకు స్పీకర్ అనుమతించారు. ఆర్ఘిక మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క మొదటగా మాట్లాడి దాని గురించి వివరించారు. పదకొండు అంశాల మీద తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నేడు చివరి రోజు అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించింది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో (ఆగస్టు 6) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. కాగా ఈ తరుణంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉందని విమర్శించారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. తెలంగాణ లో అభివృద్ది కార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. హామీలు ఇస్తారు కానీ అమలు చేయరని ఓవైసీ అన్నారు.