Etela Rajender: తెలంగాణ ఏర్పడ్డాక సర్కార్ పెట్టింది బెల్ట్, లిక్కర్ షాపులే.. : ఈటెల రాజేందర్
తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉందని విమర్శించారు.
Etela Rajender: తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉందని విమర్శించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సర్కార్ పెట్టింది బెల్ట్, లిక్కర్ షాపులేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను తాగిపించి చంపుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ బడ్జెట్ పై ఈటెల మండిపాటు
‘గత బడ్జెట్ లో 78 నుంచి 80 శాతం నిదులు ఖర్చు చేయలేదు. ఇది ప్రజలను మోసం చేసేలా ఉంది.
రాష్ట్రంలోని రైతాంగానికి రుణమాఫీ నాలుగేళ్లు అయినా చేయలేదు.. బడ్జెట్ లో రైతు రుణమాఫీ పై ఊసే లేదు.. చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలి.
ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీ రాకపోవడంతో ఈఎంఐలు సమయానికి చెల్లించలేక పోతున్నారు. సెర్ఫ్ ఉద్యోగులకు వేతనాలు పెంచలేదు.
మధ్యాహ్నం భోజనం వండే వాళ్లకి 1000 రూపాయలు ఇస్తున్నారు.. అవికూడా రెండేళ్ళ కు ఓ సారి ఇస్తున్నారు.
కేసీఆర్ కిట్ కు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. అంగన్ వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడం తో ముక్కి పోయిన ఆహారం అందుతోంది.
బాసర ట్రిపుల్ ఐటీలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గురుకులలో సరైన వసతులు లేవు.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
మన ఊరు మన బడి కేవలం చెప్పడానికే రంగు రంగులుగా కనిపిస్తుంది. ఈహెచ్ఎస్ పేరుతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స ఇవ్వలేమంటున్నారు.
ఆసుపత్రుల్లో మందులు కూడా అందడం లేదు. విద్యావాలంటరీలకు.. విదేశీ విద్య కు వెళ్లే వారికి సరైన సమయానికి డబ్బు రావడం లేదు.
కాంట్రాక్టర్ లకు ఏ శాఖలోను సమయానికి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారు.’ అని ఈటెల ప్రభుత్వం పై మండిపడ్డారు.
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా..
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా.. ప్రగతిశీల రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా.. వార్షిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మెుత్తం 2.90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
సబ్బండ వర్గాల అభివృద్దే ధ్యేయంగా.. అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ.. బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
అన్ని సామాజిక వర్గాలకు అనుగుణంగా.. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు భేదం లేకుండా కేటాయింపులు చేసినట్లు మంత్రి తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యుస్ చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయనున్నట్లు మంత్రి సభా వేదికగా ప్రకటించారు.
ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/