Telangana Assembly: అసెంబ్లీ లో అక్బరుద్దీన్ ఓవైసీ, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. హామీలు ఇస్తారు కానీ అమలు చేయరని ఓవైసీ అన్నారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ..
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. హామీలు ఇస్తారు కానీ అమలు చేయరని ఓవైసీ అన్నారు.
‘ముఖ్యమంత్రి, మంత్రులు మమ్మల్ని కలవరు. బీఏసీ లో ఇష్టా రీతిలో నిర్ణయం తీసుకున్నారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదు.
మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో కనిపించడం లేదు. బీఆర్ఎస్ నేతలకు టీవీ డిబేట్ లకు వెళ్లే సమయం ఉంటుంది.
కానీ, సభకు వచ్చేందుకు టైం లేదా..? నా 25 ఏళ్ళలో ఇలాంటి సభ చూడలేదు’ అని వ్యాఖ్యానించారు.
మంత్రి కేటీఆర్ కౌంటర్ (Telangana Assembly)
అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
‘సభ్యులను బట్టి సమయం ఇస్తాం. బీఏసీకి ఓవైసీ రారు.. రాకపోగా మళ్లీ ఆరోపణలు చేస్తారు. ఆవేశంగా ప్రసంగం చేస్తే సరిపోదు.. అర్థవంతంగా సమాధానం చెప్పొచ్చు.
7 మంది ఎమ్మెల్యే లు ఉన్న ఎంఐఎంకు గంట ఇస్తే.. మాకు ఎన్ని గంటల సమయం ఇవ్వాలి. సభా నాయకుడు రాలేదని ప్రశ్నిస్తున్నారు.
సభా నాయకుడితో ఓవైసీ కి ఏం సంబంధం? ’ అని కేటీఆర్ అన్నారు.
దానికి ఓవైసీ స్పందిస్తూ ‘నేను కొత్త సభ్యుడిని కాదు.. చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యా.. టైమ్ ను ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు.. రాజ్యంగబద్దంగా చర్చ జరగాలి..
గతంలో చాలా సభల్లో గంటల సేపు చర్చించాం.. ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు.’ అని అన్నారు.
ప్రభుత్వంపై ఓవైసీ ప్రశ్నల వర్షం (Telangana Assembly)
మరో వైపు గవర్నర్ ప్రసంగంపై అక్బరుద్దీన్ ఓవైసీ పలు ప్రశ్నలు సంధించారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అంశాలు లేవని.. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాల గురించి ప్రసంగంలో లేదన్నారు.
కేంద్రం నుంచి వచ్చే నిధుల అంశం గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ అంశాలను పేర్కొనలేదా? అని ప్రశ్నించారు.
గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలను తొలగించారా? అన్నారు. ప్రొరోగ్ చేయకుండానే సమావేశాల నోటిఫికేషన్ ఇచ్చారని.. గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందా?
ఆమోదిస్తే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కేబినెట్ కూడా చర్చించలేదా? కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఓవైసీ విరుచుకుపడ్డారు.
‘రాష్ట్రానికి ఒక్క మెడికల్ , నర్సింగ్ కాలేజ్ కేటాయించలేదు.. దీన్ని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పొందుపర్చలేదు.
రాష్ట్ర అభవృద్ధి పథకాల్లో కేంద్రం వాటా శూన్యం. కేంద్ర తెలంగాణపై వివక్ష చూపుతోంది. దీనిపై చర్చ పెట్టాలి.
టీవీ డిబేట్ లో ఎక్కువ కూర్చుంటున్నారు..అసెంబ్లీ లో కూర్చోవడం లేదు. చంద్రయాన్ గుట్ట స్టేడియం మంజూరు చేసారు.. ఇది ఎప్పుడు పూర్తి అవుతోంది.
లాల్ దర్వాజా దేవాలయం విస్తరణ పనులు ఎందుకు పూర్తి కావడం లేదు.. పాతబస్తీ మెట్రో పరిస్థితి ఏంటీ..?
చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు ఏమైంది..?’ అని తెలంగాణ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/