Home / Sports News
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తుది సమరానికి చేరుకుంది. ఆదివారం (మే 28) న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిల్ పోరులో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తలపడనున్నాయి.
ఐపీఎల్ 2023 సీజన్ లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన కనబర్చాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై 61 బంతుల్లో 101 లో అజేయంగా నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ శతకాలున్నాయి.
ఈ నెల 28 నుంచి జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్టు టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రకటించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోమవారం 35 పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది.
ముంబై క్రికెట్ అసోసియేషన్ ( ఎంసీఏ ) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అతని 50వ పుట్టినరోజు సందర్బంగా వాంఖడే స్టేడియంలో అతని విగ్రహంతో సత్కరించాలని నిర్ణయించింది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు గుడ్ బై చెప్పింది.2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటానని సానియాప్రకటించిన విషయం తెలిసిందే.ఆమె మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓడిపోయింది.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసారు. జీ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ క్రికటెర్ల ఫిట్ నెస్, ఆటగాళ్ల మధ్య విబేధాల గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు.
1st T20: రాంచీ వేదికగా జరుగుతున్న మెుదటి టి20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ తర్వాత నేడు మెుదటి టి20 జరగనుంది.
Michael Clarke: ఆసీస్ మాజీ ఆటగాడి చెంపను అతడి ప్రియురాలు చెల్లుమనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్.. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (Michael Clarke) కు ఈ చేదు అనుభవం ఎదురైంది. తనను మోసం చేసి మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నావంటూ అతడి ప్రియురాలు.. జేడ్ యాబ్రో బహిరంగంగా చెంపలపై కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుంది. […]
Usain Bolt: ప్రపంచ రికార్డు పరుగుల వీరుడు, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కు గట్టి షాక్ తగిలింది. ప్రైవేటు పెట్టుబడుల సంస్థలో బోల్ట్ కు ఉన్న అకౌంట్ నుంచి దాదాపు రూ. 100 కోట్లు( 12 మిలియన్ డాలర్లు) మాయం అయ్యాయి. సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఈ స్కాంకు పాల్పడి డబ్బులు దోచుకున్నాడు. జమైకాలోని కింగ్స్టన్కు చెందిన ఒక ప్రైవేటు పెట్టుబడి సంస్థ ‘స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్’లో ఉసేన్ బోల్ట్ పెట్టుబడి ఖాతా […]