Chetan Sharma: మాట తెచ్చిన చేటు.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసారు. జీ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ క్రికటెర్ల ఫిట్ నెస్, ఆటగాళ్ల మధ్య విబేధాల గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు.

Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసారు. జీ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ క్రికెటెర్ల ఫిట్ నెస్, ఆటగాళ్ల మధ్య విబేధాల గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. దీనితో శుక్రవారం చేతన్ శర్మ తన రాజీనామాను బీసీసీఐ కార్యదర్శి జేషాకు పంపగా ఆయన ఆమోదించారు.
గంగూలీ-కోహ్లి మధ్య ఇగో సమస్యలు..(Chetan Sharma)
జీ న్యూస్ తో చేతన్ శర్మ సౌరవ్ గంగూలీ మరియు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు విరాట్ కోహ్లీతో జరిపిన అంతర్గత చర్చలను వెల్లడించాడు.వైట్-బాల్ ఫార్మాట్‌లలో భారత కెప్టెన్‌గా తనను తొలగించడంలో గంగూలీ పాత్ర ఉందని కోహ్లీ భావించినట్లు చేతన్ చెప్పాడు. వారిద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవని అన్నాడు. వారిద్దరి మధ్య ఇగో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నాడు.
85 శాతం ఫిట్ గా ఉన్నా జట్టులోకి వచ్చేస్తున్నారు.. (Chetan Sharma)
80 నుంచి 85 శాతం ఫిట్‌గా ఉన్నప్పటికీ, చాలా మంది ఆటగాళ్లు తిరిగి జట్టులోకి తిరిగి రావడానికి ఇంజెక్షన్లు తీసుకుంటారని శర్మ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ T20I సిరీస్‌కు ఒత్తిడి ఫ్రాక్చర్ నుండి బుమ్రా తిరిగి రావడంపై తాను మరియు టీమ్ మేనేజ్‌మెంట్ ఏకీభవించలేదని పేర్కొన్నాడు. మాజీ కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మల మధ్య విబేధాలు లేవని అయితే వారిద్దరిమధ్య కూడా ఇగో సమస్యలు ఉన్నాయని అన్నారు.
BCCI, జనవరి 7న ఆల్-ఇండియా సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీని ప్రకటించింది. చేతన్ శర్మతో పాటు, సీనియర్ పురుషుల జాతీయ ఎంపిక కమిటీకి శివ సుందర్ దాస్,సుబ్రోతో బెనర్జీ,సలీల్ అంకోలా.శ్రీధరన్ శరత్ లను కూడా కమిటీ సిఫార్సు చేసింది. చేతన్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 39 టెస్టులు ఆడి 61 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 63 వన్డేల్లో 67 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
- Indore Viral News: ‘మీ షిష్ట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్లండి’
- Kethika Sharma : అదిరే అందాలను ఆరబోస్తున్న రొమాంటిక్ భామ “కేతిక శర్మ”..
- Gold and silver prices: దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు