Home / Sabitha Indra Reddy
బోనాల పండుగ చెక్కుల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ ను ఉల్లంఘించారంటూ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. మహేశ్వరంలోని ఆర్కేపురం డిజవిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీలకు చెక్కుల పంపిణీ సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను రిలీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల విద్యార్థుల ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కొద్ది సేపటి క్రితమే నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేశారు.
Sabita Indrareddy: పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్ధులను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, హాజరయ్యారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళా పాత్రికేయులను సత్కరించారు.
నిజాంకాలేజీ హాస్టల్ కొత్త బిల్డింగ్ అంతా తమకే కేటాయించాలంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్దులు చేసిన పోరాటం ఫలించింది. ఇది వారికే కేటాయించాలని ప్రభుత్వం అంగీకరించింది.
తెలంగాణలో రాజ్యాంగం, పరిపాలన వ్యవస్ధల్లో ఏర్పడిన జాప్యం కారణంగా సామాన్య ప్రజలు సతమతమౌతున్నారు. అసెంబ్లీ నుండి రాజ్ భవన్ కార్యాలయంకు చేరిన పరిపాలన బిల్లుల ప్రక్రియ గవర్నర్ ఆమోద ముద్ర దగ్గర ఆగిపోయాయి.
తెలంగాణలో ప్రభుత్వానికి-గవర్నర్ కు మద్య దూరం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రజా జీవితంతో ముడిపడిన కీలక బిల్లులు రాజ్ భవన్ కార్యాలయంలో టేబుల్ కే పరిమితమైనాయి. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఏకంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి లేఖ రాశారు.
హైదరాబాదులో విద్యా వ్యవస్ధకు మచ్చ తెచ్చేలా చోటుచేసుకొన్న చిన్నారి లైంగిక దాడి వ్యవహరంలో బంజాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సరైన నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.