Last Updated:

Telangana Inter Results : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థుల విద్యార్థుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ ఫలితాలను కొద్ది సేపటి క్రితమే నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.

Telangana Inter Results : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి..

Telangana Inter Results : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థుల విద్యార్థుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ ఫలితాలను కొద్ది సేపటి క్రితమే నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇదిలా ఉంటే ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలోనే పూర్తయింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్‌ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని.. దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే విద్యార్ధులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వెబ్ సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోండి..

http://results.cgg.gov.in/

https://tsbie.cgg.gov.in/

http://www.manabadi.co.in/#