Home / resignation
Justin Trudeau announces resignation as Canada’s prime minister: కెనడా ప్రధాన మంత్రి ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. లిబరల్ పార్టీ నాయకుడిగా తప్పుకోవాలంటూ ట్రూడో మీద సొంత నేతలే నిరసనకు దిగటంతో ఆయన కుర్చీ దిగక తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 24 వరకు పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, కొత్త నాయకుడిని పార్టీ తరపున ఎన్నుకునే వరకు ఆయన తాత్కాలిక […]
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందింది. గంటా రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చాలా కాలం క్రితమే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలపడం హాట్ టాపిక్‌గా మారింది.
టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డిని 2021లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నియమించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) పార్టీకి తన పదవికి రాజీనామా చేశారు. స్సీకరి్ తమ్మినేని సీతారాంకి తన రాజీనామా లేఖని పంపించారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానం పట్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీనితో స్పీకర్ ఫార్మాట్లొ రాజీనామా లేఖని ఆళ్ళ రామకృష్ణారెడ్డి సమర్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖరారవడంతో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. సాధారణంగా ఇటువంటి సందర్బాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్ ను కలిసి తమ రాజీనామా లేఖను పంపిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని అయినా ఆశ్చర్యకరంగా తనకి టికెట్ నిరాకరించారని నాగం జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొద్దినెలల కిందట కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసి ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే.
సీనియర్ నటి గౌతమి బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీలో సభ్యురాలిగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు.
బీహార్ కేబినెట్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ మంగళవారం తన రాజీనామాను సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కుమారుడయిన సంతోష్ కుమార్ సుమన్ నితీష్ నేతృత్వంలోని కేబినెట్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు