Last Updated:

Bihar Minister: బీహార్ కేబినెట్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ రాజీనామా

బీహార్ కేబినెట్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ మంగళవారం తన రాజీనామాను సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కుమారుడయిన సంతోష్ కుమార్ సుమన్ నితీష్ నేతృత్వంలోని కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.

Bihar Minister: బీహార్ కేబినెట్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్  రాజీనామా

Bihar Minister: బీహార్ కేబినెట్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ మంగళవారం తన రాజీనామాను సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కుమారుడయిన సంతోష్ కుమార్ సుమన్ నితీష్ నేతృత్వంలోని కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.

పార్టీని విలీనం చేయాలని సీఎం వత్తిడి..(Bihar Minister)

హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)ని జెడి(యు)లో విలీనం చేయాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన తండ్రిపై వత్తిడి తెచ్చారని సంతోష్ కుమార్ సుమన్ ఆరోపించారు. నా పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లింది, దాన్ని కాపాడుకునేందుకే ఇలా చేశానంటూ పదవికి రాజీనామా చేసిన తర్వాత సంతోష్‌ కుమార్‌ సుమన్‌ అన్నారు. పార్టీగా కూడా మాకు గుర్తింపు లేనప్పుడు జూన్ 23న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని ఆయన ప్రశ్నించారు. మా ఉనికిని కాపాడుకోవడానికి, నిష్క్రమించాను. నేను దీనిని వెనక్కి తీసుకోను. పార్టీలో గుర్తింపు లేదు. నేను అడవి నుండి మరియు ఇతరులను అణచివేసిన సింహం నుండి తప్పించుకున్నాను అని సుమన్ అన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పాలక ‘మహాగత్‌బంధన్‌’లో భాగస్వామి అయిన హిందుస్దానీ అవామ్ మోర్చాకు ఐదు సీట్లు ఇవ్వాలని ఇటీవల జితన్ రామ్ మాంఝీ డిమాండ్ చేసారు. ఐదింటి కంటే తక్కువ ఆఫర్‌కు పార్టీ అంగీకరించదని హెచ్‌ఏఎం జాతీయ అధ్యక్షుడు సంతోష్ కుమార్ సుమన్ కూడా గత వారం చెప్పారు.హెచ్ఏఎం అనేది బీహార్‌లోని ఒక ప్రాంతీయ పార్టీ, ఇది 2015లో జితన్ రామ్ మాంఝీచే స్థాపించబడింది . ఈ పార్టీకి బీహార్ శాసనసభలో 4 స్థానాలు ఉన్నాయి.