Last Updated:

Actor Gautami: బీజేపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నటి గౌతమి

సీనియర్ నటి గౌతమి బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీలో సభ్యురాలిగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు.

Actor Gautami: బీజేపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నటి గౌతమి

Actor Gautami: సీనియర్ నటి గౌతమి బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీలో సభ్యురాలిగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు.

మోసం చేసిన వాడికి పార్టీ సపోర్ట్..(Actor Gautami)

సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ‘X’లో గౌతమి తన రాజీనామాకు దారితీసిన పరిస్దితులను వివరించారు. తాను 20 ఏళ్లకిందట అళగప్పన్ అనే వ్యక్తి తో స్నేహం చేసానని పేర్కొన్నారు. నేను అతనికి నా భూములను అమ్మే బాధ్యతను అప్పగించాను. అయితే అతను నన్ను అదే విధంగా మోసం చేశాడని నేను ఇటీవలే గుర్తించాను. ఆయన కుటుంబంలో భాగమైన నన్ను, నా కుమార్తెను స్వాగతిస్తున్నట్లు నటిస్తూనే ఇలా చేసారని గౌతమి ఆరోపించారు. సుదీర్ఘ చట్టపరమైన విచారణ జరుగుతున్నప్పుడు, తన పార్టీ తనకు మద్దతు ఇవ్వలేదన్నారు. అంతేకాదు కొంతమంది సీనియర్ సభ్యులు అళగప్పన్‌కు సహాయం చేస్తున్నారని గ్రహించి తాను కుమిలిపోయానని ఆమె పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఆర్‌ దాఖలయిన తర్వాత కూడా గత 40 రోజుల తరువాత కూడా అళగప్పన్‌ తప్పించుకు తిరగడం వెనుక పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ సభ్యులు సాయం చేయడమే కారణమని ఇది తనను బాధించిందని ఆమె తెలిపారు. .తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పోలీసు శాఖ, న్యాయవ్యవస్థ తనకు కావాల్సిన న్యాయం అందిస్తాయన్న నమ్మకం తనకు ఇంకా ఉందని గౌతమి పేర్కొన్నారు. చాలా బాధతో బీజేపీకి రాజీనామా చేశానన్నారు. అయితే ఒంటరి మహిళగా , ఒంటరి తల్లిగా తన కుమార్తె భవిష్యత్తుకు న్యాయం కోసం పోరాడుతున్నానని గౌతమి చెప్పారు.